ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటికీ తలవంచరని ఆయన భార్య సునితా కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని విమర్శించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భివానీలోని టౌన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సునితా కేజ్రీవాల్ శనివారం పాల్గొని ప్రసంగించారు. బీజేపీ కేవలం అధికారదాహంతో ప్రత్యర్థులను జైలులోకి నెడుతోందని, పార్టీలను చీల్చడం ఎలాగో వారికి బాగా తెలుసునని విమర్శలు గుప్పించారు.