బాలీవుడ్ నటుడు సైఫ్‌పై దాడి కేసులో తొలుత ఓ అనుమానితుడిని ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో అసలు నిందితుడు కాదని తేలడంతో అతడిని వదిలిపెట్టారు. ఆ తర్వాత తన జీవితం దుర్భరంగా మారిందని ఆకాశ్ కనోజియా(31) అనే డ్రైవర్ పేర్కొన్నాడు. ఉద్యోగం కోల్పోవడంతో పాటు, పెళ్లి సంబంధం చెడిపోయిందని, తన కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటోందని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు.