‘డాకు మహారాజ్’ బ్యూటీ ఊర్వశి రౌతెలా మరోసారి ట్రోలింగ్‌కు గురైంది. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫొటోను షేర్ చేసిందీ ముద్దుగుమ్మ. అందులో తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుందని బెడ్‌పై ఉన్న తన అమ్మను ఫోటోను పోస్ట్ చేసింది. అయితే ఆ ఫోటోలో ఊర్వశి గాగుల్స్ పెట్టుకుని తల్లిని హత్తుకుంది. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్‌కు దిగారు. ఇక్కడ కూడా స్టైల్‌గా కళ్లద్దాలు పెట్టుకోవడం అవసరమా? అని చెడామడా తిట్టేస్తున్నారు.