AP: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో జనవరి 31న టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం కానుంది. ఈ మేరకు రథసప్తమి ఏర్పాట్లపై పాలకమండలి సభ్యులు, అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన దృష్ట్యా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారు. ఫిబ్రవరి 4న ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలనూ రద్దు చేశారు.