పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో ఉద్యోగులు స్కామ్‌కు తెరలేపారు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేరే ఖాతాదారుల పేరుతో రిజిస్టర్ చేసి సుమారు రూ.40 లక్షలు గోల్‌మాల్ చేసినట్లు సమాచారం.
నగదు చెల్లించినా రశీదు ఇవ్వకుండా కాలయాపన చేస్తుండగా, ఓ కస్టమర్ గట్టిగా నిలదీయగా స్కామ్ వెలుగులోకి వచ్చింది. గోల్డ్ స్కామ్‌లో బ్రాంచ్ మేనేజర్ ఆదినారాయణ, ఉద్యోగి గోపి పాత్ర ఉందని బాధితులు పేర్కొంటున్నారు.