పెళ్లైన ఆరు నెలలకే యువకుడి మృతి
ద్విచక్ర వాహనంను తప్పించబోయి కారు ఒక వ్యక్తిని ఢీకొన్న ఘటన అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి శివారులో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. బాలరాజు(32) అనే వ్యక్తి చెన్నారం వైపుకు వెళ్తుండగా, సందీప్ అనే వ్యక్తి తన కుటుంబంతో కారులో వస్తున్నాడు. ఈ క్రమంలో కారు ఎదురుగా వస్తున్న బైకు తప్పించబోయి బాలరాజును ఢీకొట్టగా అతను అక్కడే చనిపోయాడని తెలిపారు. అతడికి పెళ్లై ఆరు నెలలే అయిందన్నారు.