తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ దేవస్థానం అధికారులు పరిగణలోకి తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి మంగళవారం విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ అధికారులు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. స్పందించక పోతే తెలంగాణలో ఏపీ సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోకూడదని తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని అన్నారు.