ప్రజా యుద్ధనౌక గద్దర్ గ్రహ నిర్మాణ కమిటీ కన్వీనర్ గా అడ్వకేట్ శర్మను నియమించినట్లు కమిటీ పేర్కొంది. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని అడ్వకేట్ శర్మ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రజల పాటగా తన ఊపిరి ఉన్నంతవరకు ప్రజల పక్షాన నిలబడ్డ ఏకైక గాయకుడు అన్నారు. వారి ఆశయాలు ఆలోచనలు ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.