కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామంలో కొంతమంది పెత్తందారులు భూములను కబ్జా చేసి సర్వేనెంబర్ 348, 349లో గల 230 ఈత చెట్లు, 60 తాటి చెట్లు ఉండగా వాటిని పూర్తిగా తొలగించారు. దీంతో కల్లు గీత కార్మికులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామస్తులు, గీత కార్మికులతో కలిసి ఆప్కారి ఎస్సై కి గౌడ సంఘం నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు. గ్రామ చెట్లను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.