కొల్లాపూర్: సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలి
సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని జిల్లా షీటీం ఇన్చార్జి విజయలక్ష్మి సూచించారు. బుధవారం కొల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జాతీయ సైబర్ భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సెల్ఫో న్లో ఆన్లైన్లో మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయని, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రధాన కూడళ్లలో షీటీం పని చేస్తున్నట్లు విద్యార్థులకు వివరించారు. అత్యవసర సమయాల్లో 100కు డయిల్ చేయాలన్నారు.