పెద్దకార్పాముల గ్రామంలో స్లో బైక్ రైడ్ పోటీలు
పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాముల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో స్లో బైక్ రైడ్ పోటీలు నిర్వహించారు. అనంతరం సాతాని శ్రీను మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ మాజీ చైర్మన్ నాగపురి విష్ణు, బీజేపీ నాయకుడు జలాల్ శివుడు పాల్గొన్నారు.