ఇల్లు కూలి తల్లి, కూతురు మృతి
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడులో ఇల్లు కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన హనుమమ్మ తన కూతురు అంజలమ్మతో కలిసి రోజు మాదిరిగా ఇంట్లో పడుకున్నారు. కురుస్తున్న భారీ వర్షానికి ఇల్లు కూలడంతో నిద్రలో ఉన్న తల్లి కూతురు అక్కడికక్కడే మరణించారు.