Nov 19, 2024, 03:11 IST/మక్తల్
మక్తల్
మక్తల్: ఘనంగా నిజాముద్దీన్ ఉర్సు ఉత్సవాలు
Nov 19, 2024, 03:11 IST
మక్తల్ పట్టణంలోని నిజాముద్దీన్ దర్గా ఉత్సవాలు సోమవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఖాజీ సాబ్ ఇంటి నుండి దర్గా వరకు సందల్ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు తో ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు సందర్భంగా ఖవాలీ ఏర్పాటు చేశారు. దీంతో ఖవాలీ వినేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దర్గాలో బిఆర్ఎస్ నాయకులు ఆశిరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.