పిడుగుపాటుకు రైతు మృతి
నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండల కేంద్రంలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షానికి పిడుగుపాటుతో వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న బోడ రాములు (47) రైతు అక్కడికక్కడే మరణించడం జరిగింది. అక్కడే వ్యవసాయ పొలంలో పత్తి చేనులో పనిచేస్తున్న ఆయన భార్య సంజమ్మ వెంటనే చూసి దగ్గరలోని రైతులను పిలువగా వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే రైతు మృతి చెందాడు.