TG: హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి నాలా రోడ్డు భారీగా కుంగిపోయింది. గోషామహల్‌లో దారుసలామ్ నుంచి చాక్నావాడికి వెళ్లే రోడ్డులో ప్లైవుడ్ దుకాణాల ముందు మంగళవారం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆకస్మాత్తుగా రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కూలిపోయింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అతిపురాతనమైన నాలా కావడంతో కుంగినట్లుగా స్థానికులు చెబుతున్నారు.