వృద్ధుడిని కత్తితో బెదిరించి దోచుకున్న దొంగలు..వీడియో

78చూసినవారు
ఢిల్లీలో దొంగలు రెచ్చిపోయారు. ఓ వృద్ధుడిని కత్తితో బెదిరించి దొరికినకాడికి దోచుకున్నారు. ఈ ఘటన B74 పార్క్ వివేక్ విహార్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు స్కూటీపై వస్తున్న ఆ వ్యక్తిని ఇద్దరు దొంగలు బైక్ పై వెంబడించారు. అనంతరం అతడిని ఆపి కత్తితో బెదిరించి మెడలో గొలుసు లాక్కొని పారిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

సంబంధిత పోస్ట్