దేవరకొండ: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

73చూసినవారు
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఎమ్మెల్యే బాలు నాయక్ బుధవారం వీడియో సందేశం ద్వారా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసు క్రీస్తు బోధనలు విశ్వమానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని చెప్పిన యేసు ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తోందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు.

సంబంధిత పోస్ట్