దేవరకొండ: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నేతలు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. విద్యారంగ సమస్యలను నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవున పెడుతూ విద్యను విస్మరిస్తుందని, మోటార్ సైకిల్ యాత్రలో ఎస్ఎఫ్ఐ దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, జునైదు, శివకుమార్, నూతన్, సాయి తదితరులు పాల్గొన్నారు.