కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై, అర్హులైన 37 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి&షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న 6గ్యారెంటీ పథకాలు పేదలకు మరింత సహాయం చేకూరుతుందని అన్నారు.