నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు పి. ఏ. పల్లి మండలం అజ్మాపురంలో గ్రంథాలయ భవన ప్రారంభోత్సవం, 10 గంటలకు నక్కలపెంటతండలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంఖుస్థాపన, 11 గంటలకు అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద పీఏసీఎస్ గోదాం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు దేవరకొండ మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు.