సూర్యాపేటలోని వికాస్ ఫార్మసీ కళాశాలలో ఈ నెల 15, 16న ఏబీవీపీ విద్యార్ధి నాయకుల ప్రశిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ నుండి విద్యార్థి నాయకులు హాజరై పలు విద్యార్ధి సమస్యలపైన సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించారు. ఇందులో భాగంగా దేవరకొండకి చెందిన యలమల గోపీచంద్‌ని ఉమ్మడి నల్గొండ జిల్లా హాస్టల్స్ కన్వీనర్‌గా నియమించారు. ఆదివారం ఈ బాధ్యత అప్పగించిన ఏబీవీపీ రాష్ట్ర, జిల్లా శాఖకి గోపీచంద్ ధన్యవాదాలు తెలిపారు.