బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీ ఏర్పాటు
మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య సమక్షంలో గ్రామంలోని రెండు బూత్ ల నుండి కమిటీ సభ్యులను ఎంపిక చేశారు.