మర్రిగూడెం మండలం, ఖుదాభక్షి పల్లి గ్రామంలో గురువారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూడిద సురేష్ పలు గ్రామ సమస్యల పై డిప్యూటీ తహసిల్దార్ తారక రామన్ కు ఫిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గ్రామ కార్యదర్శి పొట్టగిరి, సహాయ కార్యదర్శి మేతరి యాదయ్య, సీనియర్ నాయకులు ఇష్కిల్ల మహేందర్, సిరిపంగి శ్రీనివాస్ బొమ్మగాని హనుమంతు, అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.