నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామపంచాయతీ పరిధిలోని అజ్మీర తండాలో మంగళవారం ధీరవత్ లక్ష్మ ఇళ్ల కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో గుడిసె పూర్తిగా కాలిపోయినది. సమాచారం తెలుసుకున్న సామాజికవేత్త
కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ధీరవత్ లక్ష్మ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 10వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేసి వారి కుటుంబానికి అండగా ఉంటాను అని చెప్పడం జరిగింది.