ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

62చూసినవారు
ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
సినీహీరో జూనియర్ ఎన్టీఆర్ 41వ జన్మదినోత్సవ వేడుకలను అభిమానులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. మిర్యాలగూడ మండలంలోని కొత్తగూడెం గ్రామంలో ఉన్న మహర్షి దయానంద సేవాశ్రమ ట్రస్ట్ ఆశ్రమంలోని 50 మంది వృద్ధులకు నందమూరి తారకరామారావు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు లాకా రాజశేఖర్, పట్టణ అధ్యక్షులు ఇండ్ల గణేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్