'నా భార్య నుంచి నన్ను కాపాడండి'

558చూసినవారు
'నా భార్య నుంచి నన్ను కాపాడండి' అంటూ ఏపీలోని అమలాపురానికి చెందిన టెమూజియన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్ మల్లారెడ్డి కళాశాలలో ఇంగ్లీష్‌ ఆచార్యునిగా పనిచేస్తూ ఆల్వాల్‌‌లో నివాసం ఉంటున్న అతడికి.. రాజోలుకు చెందిన అమ్మాయితో ఏడేళ్ల క్రితం వివాహం కాగా ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లైనప్పటి నుంచి భార్య శారీరకంగా, మానసికంగా హింసిస్తోందని, తాజాగా కత్తితో దాడి చేసిందంటూ గాయాలు చూపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవట్లేదంటూ గోడు వెలిబుచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్