ప్రమాదవశాత్తు బోర్వెల్ లారీ పైనుంచి కిందపడి కార్మికుడు మృతి చెందిన ఘటన మిర్యాలగూడలో చోటుచేసుకుంది. ఎస్సై నరేష్ వివరాల ప్రకారం. చత్తీస్గఢ్ కి చెందిన బోటి రామ్ భగేల్ చింతపల్లిలో నివాసం ఉంటూ బోర్వెల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బోర్ వేయడానికి వెళ్తుండగా లారీ పైనుంచి పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అన్న భువనేశ్వర్ భగేల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.