మర్రిగూడ: రాజు కుటుంబానికి నర్సింహారెడ్డి ఆర్థిక సహాయం

51చూసినవారు
మర్రిగూడ: రాజు కుటుంబానికి నర్సింహారెడ్డి ఆర్థిక సహాయం
మర్రిగూడ మండలంలో యరగండ్లపల్లి గ్రామానికి చెందిన దినసరి కూలి అయిన రాజు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పులిమామిడి నర్సింహా రెడ్డి వారి కుటుంబానికి 10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాల్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమ్మరజు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్