పెద్ధవుర మండలంలో నయనవానికుంట గ్రామంలో బీఆర్ఎస్ యువ నాయకులు వినయ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కనక దుర్గమ్మ దేవాలయం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి హాజరైయ్యారు ప్రత్యేక అతిధి ఎమ్మెల్సీ కోటిరెడ్డి. కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసారు అనంతరం అదే గ్రామం లో యాదవుల ఆరాధ్య దైవం అయిన గంగమ్మ తల్లి దేవలనికి వెళ్లి కొబ్బరికాయ కొట్టారు. తమ గ్రామం జరుగుతున్న గంగమ్మ తల్లి జాతరకు ఎమ్మెల్సీ కోటిరెడ్డి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ బీఆర్ఎస్ నాయకులు కత్తి శ్రీనివాస్ రెడ్డి, అవుల శ్రీనివాస్ రెడ్డి, బోలిగొర్ల శివ, బైకాని సైదులు, బైకానీ రమేష్, పవన్ హాజరయ్యారు.