పొలంలో ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి

80చూసినవారు
పొలంలో ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి
ట్రాక్టర్ పల్టీ కొట్టిన ప్రమాదంలో ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ శోభన్ బాబు (35) మృతి చెందిన ఘటన నిడమానూరు మండలంలోని తుమ్మడం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామంలోని సైదులు పొలం కిరాయికి దున్నుతుండగా ట్రాక్టర్ ఫుల్ వీల్స్ (ఇనుప చక్రాల) తో మట్టిలో కూరుకుపోయింది. ట్రాక్టర్ బయటికి తీసే సమయంలో ట్రాక్టర్ ఫుల్ రేసింగ్ ఇవ్వడంతో ట్రాక్టర్ బోల్తా పడి శోభన్ బుడుదల కూరుకుపోయి మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్