![పలు బేకరీలలో ఆకస్మిక తనిఖీ పలు బేకరీలలో ఆకస్మిక తనిఖీ](https://media.getlokalapp.com/cache/f3/ae/f3ae40d76b334189decb87c3a312179d.webp)
పలు బేకరీలలో ఆకస్మిక తనిఖీ
నల్లగొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలో గల బేకరీలపై జిల్లా ఇంచార్జ్ ఫుడ్ సేఫ్టీ అధికారి పి స్వాతి హాలియా మున్సిపల్ కమిషనర్ మునవర్ అలీ, వారి సిబ్బందితో కలిసి గురువారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా ఫిర్యాదు మేరకు ఫేమస్ బైక్స్ అను బేకరీలో అపరిశుభ్రంగా ఉన్న బేకింగ్ గదులను పరిశీలించి 15వేల రూపాయలు జరిమానా విధించారు. పలు షాపుల్లో ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ కు తరలించారు.