నల్లగొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో గ్రామ పంచాయతీ గడ్డి కోత యంత్రాలు కొనక పోవడం అలాగే మొక్కలు పెంపకం, పారిశుద్ధ్యం, కంపోస్టు షెడ్ నిర్వహణ వంటి కారణాల వల్ల గుర్రంపోడు ఎంపీడీఓ పి. మంజులను అలాగే, ఇతర ఉద్యోగులను సస్పెండ్ చేశారు. దీనికి నిరసనగా వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని బుధవారం నల్లగొండ జిల్లా లోని 844 మంది గ్రామ పంచాయతీ సెక్రెటరీలు సెలవులు తీసుకుని నిరసన తెలిపారు.