నార్కట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య జన్మదినం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉషయ్య అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.