మునుగోడు: ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దంపతులు

79చూసినవారు
మునుగోడు: ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దంపతులు
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ఆదివారం ప్రారంభించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా పేదలకు కంటి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు వైద్య శిబిరాన్ని నిర్వహించమన్నారు. పేద ప్రజలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే దంపతులు తెలిపారు.