చిట్యాల మండలం పిసాటిగూడెం గ్రామంలో మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును లాక్కెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుగుణమ్మ తన ఇంటిలో మంచంపై పడుకొని ఉండగా గుర్తు తెలియని నలుగురు దొంగలు ఇంట్లోకి వచ్చి మెడలో ఉన్న సుమారు 3తులాల బంగారం పుస్తెల తాడును దొంగిలించారు. భాదితురాలి ఫిర్యాదు మేరకు చిట్యాల ఎస్ఐ సైదాబాబు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.