రామన్నపేట: మల్లన్న గుట్టపై పోటెత్తిన జనం

72చూసినవారు
రామన్నపేట: మల్లన్న గుట్టపై పోటెత్తిన జనం
కార్తీకపౌర్ణమి సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. దీపాలు వెలిగించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున పాల్గొని శివుడికి అభిషేకాలతో పాటు మహిళలు ఆలయ పరిసరాల్లో దీపారాధనలు చేశారు.

సంబంధిత పోస్ట్