తిప్పర్తి మండల కేంద్రంలో కోమటిరెడ్డి యువసేన తిప్పర్తి ఆధ్వర్యంలో, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. నల్లగొండ అభివృద్ధి ప్రధాత, ఆపదలో ఉన్న పేదలకు నిత్యం అండగా ఉండే గొప్ప నాయకుడు కోమటిరెడ్డి అని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బద్దం సుధీర్, మండల అధ్యక్షులు జూకూరి రమేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాశం నరేష్ రెడ్డి, ఎంపీటీసీలు పల్లె ఎల్లయ్య, మట్టయ్య, సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంతినేని నాగేశ్వరరావు, కోన వెంకన్న, ఆదిమూలం ప్రశాంత్, పాదూరి శ్రీనివాస్ రెడ్డి, జాకటి భాస్కర్, నామ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.