మిర్యాలగూడ: ఈనెల 16న గురుకుల ప్రవేశ పరీక్ష

63చూసినవారు
మిర్యాలగూడ: ఈనెల 16న గురుకుల ప్రవేశ పరీక్ష
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతీపురం గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో ఈనెల 16వ తేదీన తెలంగాణ ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు అర్హత పరీక్షను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జాను నాయక్ ఆదివారం తెలిపారు. ఉదయం 10: 30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని నిర్దేశించిన సమయానికి గంట ముందు పరీక్షా కేంద్రానికి రావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్