నల్లగొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులను నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.