భాజపా నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, గుర్రం చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఓటర్లతో సమావేశమయ్యారు, పులి సరోత్తంరెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అలుగుపల్లి పాపిరెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.