నల్గొండ: సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు

70చూసినవారు
మంత్రుల నివాస సముదాయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు భవనాలు మంత్రి , నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుక చౌదరి తో పాటు ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం రెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో తాగునీరు, సాగునీరు, విద్యుత్ వంటి అంశాలపై జిల్లా ప్రజాప్రతినిధులతో చర్చించడం జరిగింది. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.

సంబంధిత పోస్ట్