గత 2 సంవత్సరాల నుండి పేరుకుపోయిన డిగ్రీ ఫీజు బకాయిలు ఈ దసరా పండుగ లోపు చెల్లించకపోతే, దసరా పండుగ మరుసటి రోజు నుండి ప్రైవేట్ డిగ్రీ కాలేజీ లు నిరవధికంగా బంద్ చేస్తామని ఎంజీ యూనివర్సిటీ నల్గొండ అసోసియేషన్ తెలిపింది. త్వరలో జరగబోయే సెమిస్టర్ పరీక్షలను కూడా విద్యార్థులు రాసే పరిస్థితి లో లేరని, పేద, మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని ఆయా విద్యార్థి సంఘాలు శనివారం డిమాండ్ చేశాయి.