ఉపాధి హామీ నిధుల నుంచి పేద రైతులకు పండ్ల తోటల అభివృద్ధి కొరకు ఈజీఎస్ నుంచి వచ్చే నిధులను మెటీరియల్ పేమెంట్ లను రైతు పర్సనల్ అకౌంట్ లో నగదు వేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ అధికారులను కోరారు. ఆదివారం పెద్ద అడిశర్లపల్లి మండలం వద్దిపట్ల ఉమ్మడి గ్రామపంచాయతీ పడమటి తండా, పుట్టంగండి గ్రామాల్లో సీపీఎం పోరు బాటలో భాగంగా గ్రామ సమస్యలపై సర్వే చేసి సమస్యలు తెలుసుకున్నట్లు తెలిపారు.