నల్గొండ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వారితో ఉన్నారు.