కలెక్టరేట్ ఎదుట రెండవ ఏఎన్ఎంలు చేపట్టిన నిరవధిక సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది. బుధవారం నిరవధిక సమ్మెలో భాగంగా రెండో ఏఎన్ఎంలు నల్గొండ కలెక్టరేట్ ఎదుట బతుకమ్మలతో నిరసన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న రెండో ఏఎన్ఎం లను న్యాయబద్ధంగా ఆలోచించి పర్మినెంట్ చేయాలన్నారు.