శాలిగౌరారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అన్నారు. కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.