రాజీవ్ గాంధీకి ఘన నివాళులు

372చూసినవారు
రాజీవ్ గాంధీకి ఘన నివాళులు
నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్‌గాంధీ 76వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... 18 ఏళ్ళకు యువతకు ఓటుహక్కు కల్పించి, దేశ రాజకీయాలలో అధిక ప్రాధాన్యం కల్పించారని, శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన గొప్ప వ్యక్తి రాజీవ్ అని అన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను పటిష్ఠం చేసాడని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాశం నరేష్ రెడ్డి, ఎర్రగడ్డలగూడెం సర్పంచ్ ఎల్లాంల సతీష్ రెడ్డి, నల్గొండ అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గండమళ్ళ మనోహర్, సీనియర్ నాయకులు సోమరాజు,బద్దం సైదులు,ప్రవీణ్,బండి సంజీవ,బాలు,లక్ష్మణ్,నాగరాజు, గోపి,పుల్లారెడ్డి, గిరి,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్