గ్రామంలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

61చూసినవారు
గ్రామంలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
గ్రామంలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలో ఉన్న జిల్లా సమాఖ్య భవనంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తున్నదని, ఇందులో భాగంగానే మహిళా సంఘాలకు పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను అప్పగించిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్