జిల్లాలోని శ్రీపార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఆలయ సిబ్బంది ప్రకటించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆగస్టు 18 నుంచి 20వ తేదీ వరకు ఆలయంలోకి భక్తులను అనుమతించమని స్పష్టం చేసింది. ప్రతి అమావాస్య నాడు చెర్వుగట్టు ఆలయానికి సుమారు లక్ష మంది భక్తులు తరలివస్తుంటారు. ఆ రోజు అక్కడ నిద్ర చేస్తే ఆర్థిక, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఈ క్రమంలో ఒకేసారి అంతమంది భక్తులు గుమిగూడితే కరోనా వ్యాపించే అవకాశం ఉన్నందున ఆలయాన్ని మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు తెలిపారు. అమావాస్య ఆగస్టు 19న వస్తుంది. అయితే ఈ మూడు రోజులు కేవలం పూజారులు మాత్రమే ఆలయంలోకి వెళ్లనున్నారు. ఆగస్టు 21 నుంచి భక్తులకు అనుమతి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ కరోనా లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని ఆలయ సిబ్బంది భక్తులను కోరుతున్నారు.