గంజాయి రహిత సమాజాన్ని తీర్చిదిద్దడమే మనందరి లక్ష్యమని నల్గొండ వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని జేబీఎస్ ప్రభుత్వ పాఠశాలలో మహిళా, శిశు, వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటి యువత మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.